VSP: భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తిరుమల్ రావు హెచ్చరించారు. తరచూ పేకాట, వ్యభిచారం, పార్టీల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఓ రిసార్ట్‌ను మంగళవారం సీజ్ చేశారు. ఇలాంటి ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.