JGL: మల్యాల మండలం రాంపూర్ గ్రామశివారులోని ఐకేపీ సెంటర్ సమీపంలో వరద కాలువ వద్ద అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగామట్టిని నింపుతున్న 3 టిప్పర్లు, ఓ జేసీబీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.