»Bomb Blast In Chhattisgarh The Incident Occurred Within An Hour Of The Start Of Polling
Breakig News : చత్తీస్‌గఢ్‌లో బాంబు పేలుడు..పోలింగ్ ప్రారంభమైన గంటలోనే ఘటన
చత్తీస్‌గఢ్ అసెంబ్లీ జరుగుతున్న మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే సుక్మా జిల్లా తొండమర్కలో జరిగిన ఈఐడీ పేలుడులో సీఆర్పీఎఫ్ జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఎన్నికల వేళ చత్తీస్‌గఢ్(Chhattisgarh)లో నక్సల్స్ రెచ్చిపోతున్నారు. సుక్మా జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన గంటసేపటికే ఐఈడీ బాంబు పేలింది.ఈ పేలుడు ధాటికి సిఆర్పిఎఫ్ జవాన్ (CRPF jawan) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలింగ్‌ను బహిష్కరించాలని మావోయిస్టులు (Maoists)హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే పలుచోట్ల మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. కోబ్రా టీమ్ (Cobra Team) లోని 206 బెటాలియన్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ జవాన్లు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. నక్సల్స్ పాతిపెట్టిన బాంబుపై కాలు వేయడంతో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. నేడు ఎన్నికలు జరుగుతున్న 20 నియోజకవర్గాల్లో పేలుడు జరిగిన కొంటా అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఉంది.