KDP: రాజుపాలెం మండలం గోపాయపల్లె, కుమ్మర పల్లెలో మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్న వారి నుంచి 105 సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాగ కీర్తన తెలిపారు. సోమవారం వచ్చిన సమాచారం మేరకు దుకాణాలపై దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.