ఎన్నికల నియమావళిని అతిక్రమించి అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టడంతో ఈ కేసు చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ పై కేసు నమోదయ్యింది.అతని కుమారుడు ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్‌తో పాటు గులాం ఖాదర్ జిలానీ అలియాస్ మన్నాన్లపై చార్మినార్ (Charminar) పోలీసులు సుమోటో కేసులు నమోదు చేశారు. గులాం ఖాదర్ జిలానీపై ఈ కేసుతో పాటు ఫైజల్ ఖాన్ అనే బాధితుడికి సంబంధించిన మహిళలను దుర్భాషలాడిన ఘటనలో మరో సుమోటో కేసు నమోదైంది. పోలీసులు తమను కారణం లేకుండా ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే ముంతాజ్(MLA Muntaz)ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.
శనివారం అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యే, అతని కొడుకు దాదాపు 200 మంది అనుచరులను వెంటబెట్టుకొని భారీ ర్యాలీ (Huge rally) నిర్వహించారు. హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ ఆఫీస్ నుంచి మీరాలం మండి, బీబీబజార్ చౌరస్తా, మొఘల్‌పుర వాల్టా హోటల్, మొఘల్‌పుర వాటర్ ట్యాంకు మీదుగా హుస్సేనీఆలం వరకు ఈ ర్యాలీ కొనసాగించారు. దీనిని సుమోటో(Sumoto)గా స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ (Election Code) కొనసాగుతున్న సమయంలో రిటర్నింగ్ అధికారి అనుమతి పొందకుండా ర్యాలీ చేపట్టడం ఈ కేసు నమోదు చేయడానికి కారణంగా ఉంది. తండ్రీకొడుకులతోపాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఒక కేసు విషయంలో ఎమ్మెల్యే ఇంతియాజ్‌ను శనివారం పోలీసులు (Police) అదుపులోకి తీసుకుని విచారించారని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు