»Minister Malla Reddy Slams Revanth Reddy And Mynampally Hanmantha Rao
Mynampally ఓ రౌడీ, రేవంత్ అబద్ధాల కోరు: మంత్రి మల్లారెడ్డి
మైనంపల్లి హన్మంతరావు, రేవంత్ రెడ్డిలపై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి ఓ రౌడీ అని.. రేవంత్ తన నియోజకవర్గానికి నిధులు ఖర్చు చేయలేదని మండిపడ్డారు.
Minister Malla Reddy Slams Revanth Reddy And Mynampally Hanmantha Rao
Minister Malla Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) వర్సెస్ మైనంపల్లి హన్మంతరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. మైనంపల్లి కామెంట్లకు ఈ రోజు మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
మైనంపల్లి హన్మంతరావు రౌడీ అని మల్లారెడ్డి (Malla Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ గెంటేస్తే కాంగ్రెస్లోకి వెళ్లాడని గుర్తుచేశారు. ఆ పార్టీలోకి వెళ్లిన తర్వాత పిచ్చి పట్టినట్టు అయ్యిందన్నారు. ఆయన గెలిచేది లేదు.. చేసేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ అంటే స్కామ్.. కేసీఆర్ అంటే అభివృద్ధి అని కుండబద్దలు కొట్టారు. ఎప్పుడూ కాంగ్రెస్ మాయమాటలు చెబుతుందని.. వారి హయాంలో కరెంట్ కోతలతో పరిశ్రమలు కుదేలయ్యాయని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో కులవృత్తుల వారు మురిసిపోతున్నారని మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) చెబుతున్నారు. గతంలో వానలు పడాలని మొక్కేవారని.. ఇప్పుడు వానలు చాలని మొక్కే పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్ అని విరుచుకుపడ్డారు. ముస్లిం, దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చూసిందని పేర్కొన్నారు. ఏ రోజు మనుషులుగా చూసి.. సంక్షేమం కోసం పాటు పడలేదని చెబుతున్నారు.
ఎంపీగా మల్కాజిగిరి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఏం చేశారని మల్లారెడ్డి (Malla Reddy) అడిగారు. పైసా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ఇక ఆయన సీఎం అయి.. రాష్ట్రాన్ని ఏం ఉద్దరిస్తాడని అడిగారు. కాంగ్రెస్ నేతలకు పగటి కలలు ఎక్కువ అవుతున్నాయని.. అప్పుడే మంత్రి పదవులు కూడా పంచుకుంటున్నారని ధ్వజమెత్తారు.