»She Stays Away From Parties Thats Why Heroine Opportunities Did Not Come Anasuya
Anasuya: అందుకే హీరోయిన్ అవకాశాలు రాలేదు
వెండితెర నటి అనసూయకు హీరోయిన్గా అవకాశాలు ఎందుకు మిస్సయ్యాయో వెల్లడించింది. అత్తారింటికి దారేది సినిమాలో ఐటమ్ సాంగ్ ఎందుకు చేయలేదో వివరించింది. ఆ సమయంలో ఎలాంటి ట్రోల్స్ గురయ్యిందో తెలిపింది.
She stays away from parties, that's why heroine opportunities did not come.. Anasuya
Anasuya: బుల్లితెర యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకొని వెండితెరపై అద్భుతమైన పాత్రల్లో అలరిస్తున్న నటి అనసూయ (Anasuya). అందం, అభినయంతోపాటు మాటల్లో గడుసుతనం చూపించే ఈమె ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేస్తుంది. నటన మీద ఇష్టంతోనే బుల్లితెరకు వచ్చినట్లు ఆ తరువాత సిల్వర్ స్క్రీన్‌పై అవకాశాలు కోసం ప్రయత్నం చేసి సక్సెస్ అయినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. తన కెరియర్ ప్రారంభంలో జరిగిన ఘటనలు చెబుతూ.. అప్పటికి ఇప్పటికి చాలా మారాను అని తెలిపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలో తనకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నానని.. ఆ సమయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురయ్యినట్లు చెప్పింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ అవకాశం వచ్చిందని, అయితే తనతో పాటు చాలా మంది హీరోయిన్స్ ఉంటారు అని తెలిసి ఆ ఛాన్స్‌ను రిజెక్ట్ చేసినట్లు చెప్పింది. ఆ సమయంలో ఎలా మాట్లాడాలో తెలియదని, తాను చిన్నప్పటి నుంచి ముక్కుసూటిగా వెళ్లే దోరణి ఉండడంతో ట్రోల్స్‌కు గురయ్యినట్లు చెప్పింది. తరువాత త్రివిక్రమ్‌కు సారీ చెప్పాను అని తెలిపింది. తనకు పార్టీలకు వెల్లడం అసలు ఇష్టం ఉండదని.. అందుకే తనకు హీరోయిన్ అవకాశాలు మిస్ అయ్యాయని వెల్లడించింది. అలానే అవకాశాలు వస్తాయి అంటే వద్దనే చెప్తా అంది. పరిశ్రమలో చాలా నేర్చుకున్నానని, ఇప్పుడు ఏ పాత్ర వచ్చినా చేస్తానని, తనకు నటించే స్కోప్ ఉంటే చాలని అంటుంది. తన భర్త చాలా ఫ్రీడమ్ ఇచ్చాడని, సోషల్ మీడియాలో తనకు కామెంట్లు పెట్టే వాళ్ల వైఫ్‌లను తలచుకుంటే జాలేస్తుందని తెలిపింది.