»Actor Kamal Haasan Duaghter Akshara Haasan Buys Rs 1575 Crore Apartment In Mumbai
Aksharahasan: కమల్ హాసన్ బిడ్డకు ఇంత డబ్బు ఎక్కడిదబ్బా..రూ.15 కోట్లు పెట్టి బంగ్లా కొంటానికి?
విశ్వనటుడు కమల్ హాసన్ ఇద్దరు కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరూ ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఓ వైపు శృతి హాసన్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తోంది.
Aksharahasan: విశ్వనటుడు కమల్ హాసన్ ఇద్దరు కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరూ ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఓ వైపు శృతి హాసన్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తోంది. హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించడమే కాకుండా హిందీ వెబ్ సిరీస్‌లలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తన అందచందాలతో అలరిస్తోంది. శృతి హాసన్ చేసే సినిమాలకు కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. కానీ అక్షర హాసన్ ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటించింది. ఆమె కెరీర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. ఆమె చేతిలో ఆఫర్లు కూడా పెద్దగా లేవు. ఇక రెమ్యునరేషన్ విషయం గురించి మాట్లాడుకోకపోవడమే మంచింది.
అంతగా క్రేజ్ లేని అక్షర హాసన్ ఇటీవల ముంబైలో రూ. 15.75 కోట్లు విలువ చేసే ప్లాట్ కొన్నది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాదాపు కోటి రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించింది. ప్లాట్ ఇంటీరియర్‌తో పాటు ఇతర ఏర్పాట్లకు అక్షర హాసన్ మొత్తం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వినికిడి. చేతిలో సినిమాలు లేని అక్షర హాసన్‌కి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అక్షర హాసన్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురని అందరికీ తెలుసు. ఆయన ఆస్తులు, సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి తండ్రి కూతురు అక్షర ఏకంగా 20 కోట్లతో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనడంలో ఆశ్చర్యం ఏముందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏక్తా టవర్ వెర్వ్లోని 13వ అంతస్తులో అక్షర హాసన్ కొనుగోలు చేసింది. ప్లాట్‌లో అద్భుతమైన వ్యూ కలిగిన బాల్కానీ ఉంది. అంతే కాకుండా ఇందులో మూడు కార్లు పార్కింగ్ చేసుకునే వీలుంది. 13వ అంతస్తులో ఉండడంతో ప్రత్యేకంగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అక్షర కొత్త ఫ్లాట్ అన్నింటికంటే విలాసవంతంగా, అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.