»Pushpa 2 Movie Allu Arjun Shooting November 2nd Gangamma Jatara Set
Pushpa 2: పుష్పరాజ్ ఈజ్ బ్యాక్..రేపే గంగమ్మ జాతర!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే అంతకు మించి అనేలా అన్లిమిటెడ్ బడ్జెట్‌తో పుష్ప2 తెరకెక్కుతోంది. ఈ క్రమంలో రేపే గంగమ్మ జాతర మొదలు కాబోతోంది.
Pushpa 2 movie allu arjun shooting november 2nd Gangamma Jatara set
పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. అందుకే ఈసారి అస్సలు తగ్గేదేలే అంటున్నారు బన్నీ, సుకుమార్. పెరిగిన అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పుష్ప2(Pushpa 2) వీడియో అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయింది. ముఖ్యంగా బన్నీ అమ్మవారు గెటప్ అయితే ఊహకందని విధంగా ఉంది. ఇక రీసెంట్గా బన్నీ నేషనల్ అవార్డ్ రావడంతో పుష్ప2 పై అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోయాయి. ఖచ్చితంగా పుష్ప2 వెయ్యి కోట్ల బొమ్మ అని ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. దీనికి తోడు మధ్య మధ్యలో షూటింగ్ నుంచి లీక్ అవుతున్న అప్డేట్స్, స్టిల్స్, వీడియోలు అదిరిపోతున్నాయి.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా 2024 ఆగష్టు 15న ‘పుష్ప2’ రిలీజ్ చేస్తున్నట్టుగా రీసెంట్‌గానే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. కానీ రీసెంట్గా నేషనల్ అవార్డ్ అందుకోవడానికి ఢిల్లి వెళ్లడం..ఈ లోపు వరుణ్ తేజ్ పెళ్లి కూడా ఉండడంతో పుష్ప2 షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు అల్లు అర్జున్(allu arjun). అయితే ఇప్పుడు పుష్ప2 షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. నవంబర్ 2 నుంచి..అంటే రేపటి నుంచే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. దీనికోసం భారీ ఎత్తున గంగమ్మ జాతర సెట్(Gangamma Jatara set) వేశారట. ఈ షెడ్యూల్లో భారీ ఫైట్‌తోపాటు, యాక్షన్ సీన్‌కి ముందు వచ్చే సీన్లని చిత్రీకరించనున్నారట. అలాగే.. ఓ సాంగ్ షూట్ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇకపోతే..ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.