»New Yorks Metropolitan Museum To Return Another 1414 Statues To India
Ancient idols: భారత్‌కు తిరిగిరానున్న 1414 పురాతన విగ్రహాలు
భారత్ నుంచి స్మగ్లింగ్ కాబడిన 1414 విగ్రహాలు తిరిగి మన దేశానికి ఇస్తున్నట్లు న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం అంగీకరించింది. ఇదివరకే 105 విగ్రహాలను ఇచ్చింది.
New York's Metropolitan Museum to return another 1,414 statues to India
Ancient idols: మన దేశ సంపద గురించి అందరికీ తెలిసిందే. అందుకే భారత్ అన్నా, ఇక్కడి పురాతన వస్తువులు అన్నా విదేశాల్లో విలువ ఎక్కువ. బ్రిటిష్ పాలన నుంచి ఇండియాలో విలువైన వస్తువులను తీసుకెళ్లడమో, దొంగిలించడమో జరుగుతూనే ఉంది. తాజాగా విదేశాలకు తరలిపోయిన భారతీయ పురాతన విగ్రహాలు (Antiquities) , వస్తువులను తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తుంది మన ప్రభుత్వం. దీనిలో భాగంగా అమెరికా (America) న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం (ఎంఈటీ)లో ఉన్న 1414 విగ్రహాలను తిరిగి మన దేశానికి పంపడానికి అంగీకరించింది. మూడు నెలల క్రితం 105 పురాతన విగ్రహాలను పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు 1414 విగ్రహాలను అక్కడి భారత కాన్సులేట్ జనరల్‌కు అందించినట్లు తెలుస్తోంది.
ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆ మ్యూజియంలో పర్యటించింది. భారత్‌కు చెందిన విగ్రహాలను గుర్తించింది. దానికి సంబంధించిన ఆధారాలను, చోరీ కాబడినట్లు సాక్ష్యాలను అక్కడి అధికారులకు అందించింది. డొంక లాగితే తీగ కదులుతుంది అన్నట్లు చోరీ చేసి వాటిని ఎంఈటీ మ్యూజియంకు అమ్మిన వ్యక్తిని సుభాష్ కపూర్‌గా గుర్తించింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం అతడు జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మేరకు మార్చి 22న న్యూయార్క్ సుప్రీం కోర్టు ఎంఈటీపై ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల్లోగా అక్రమంగా కొనుగోలు చేసిన విగ్రహాలను వెనక్కి ఇచ్చేయాలని చెప్పింది. తీర్పుకు అనుగుణంగానే విడతల వారిగా విగ్రహాలను భారత్‌కు తిరిగి పంపుతోంది.