»A Soap That Cures Skin Cancer Is Ready Hats Off To The 14 Year Old Young Scientist
Skin Cancer Soap: చర్మ క్యాన్సర్‌ను నయం చేసే సబ్బు రెడీ..14 ఏళ్ల యంగ్ సైంటిస్ట్‌కి హ్యాట్సాఫ్
ఓ 14 ఏళ్ల యువకుడు స్కిన్ క్యాన్సర్‌కు సోప్‌ను కనిపెట్టాడు. అమెరికాకు చెందిన హేమన్ బెకెలే అనే యువకుడు కనిపెట్టిన ఆ సోప్ ధర 10 డాలర్లు మాత్రమే. మన భారత కరెన్సీలో దాని విలువ రూ.830లు. స్కిన్ క్యాన్సర్‌ను తగ్గించే ఆ సోప్‌ను చిన్న వయసులోనే పరిశోధనలు చేసి కనిపెట్టడం గొప్ప విషయమని హేమన్ బెకెలేను సైంటిస్టులు ప్రశంసిస్తున్నారు.
క్యాన్సర్ (Cancer) వల్ల ఇప్పటికే అనేక మంది ప్రాణాలు విడిచారు. క్యాన్సర్ వల్ల బాధపడుతున్నవారి సంఖ్య వర్ణనాతీతం. డబ్బున్న వారైతే క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని బతికే అవకాశం ఉంది. పేదవారికి సోకితే మాత్రం ఇక వారు ప్రాణాల మీద ఆశను వదులుకోవాల్సిందే. మరి అటువంటి భయంకరమైన క్యాన్సర్లలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో చర్మ క్యాన్సర్ కూడా ఉంది. తాజాగా ఈ చర్మ క్యాన్సర్ (Skin Cancer)కు ఓ 14 ఏళ్ల కుర్రాడు సబ్బును కనిపెట్టాడు.
అమెరికా (America)కు చెందిన హేమన్ బెకెలే (Hemen Bekele) అనే 14 ఏళ్ల యంగ్ సైంటిస్ట్ క్యాన్సర్ చికిత్స కోసం సబ్బును కనిపెట్టి ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. ఎన్నో దశాబ్దాలుగా ఈ స్కిన్ క్యాన్సర్‌కు మందులు కనిపెట్టే విషయంలో చాలా మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. కానీ వారెవరూ సాధించలేనిది 14 ఏళ్ల కుర్రాడు హేమన్ బెకెలే సాధించాడు. ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలోని ఫ్రాస్ట్ మిడిల్ స్కూల్లో చదువుతున్న హేమన్ బెకెలే చర్మ క్యాన్సర్ చికిత్సకు సబ్బును కనిపెట్టడంతో పరిశోధకులు అతనికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
అమెరికా టాప్ యంగ్ సైంటిస్టుగా ప్రసిద్ధి చెందిన హేమన్..చర్మ క్యాన్సర్ చికిత్స కోసం కనిపెట్టిన సబ్బు ధర కేవలం 10 డాలర్లు కావడం విశేషం. భారత కరెన్సీలో రూ.830లు మాత్రమే. అత్యంత తక్కువ ధరకే చర్మ క్యాన్సర్‌కు సబ్బును కనిపెట్టిన ఈ యంగ్ సైంటిస్ట్‌ను ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సబ్బును వాడితే క్యాన్సర్ కణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తుంది. ఈ సబ్బుకు స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ సోప్ (Skin Cancer Treating Soap) అనేపేరును పెట్టారు.