యంగ్ మాస్ట్రో SS థమన్ (SS Thaman) బాక్సాఫీస్ వద్ద “భగవంత్ కేసరి” విజయంతో చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే అతని పాటలు, సంగీతం కుటుంబ ప్రేక్షకులకు తక్షణ కనెక్టర్లుగా మారాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అఖండ (Akhanda) రేంజ్ లో లేకపోయినా సినిమాకి పాజిటివ్ గా వర్క్ చేసింది. ఆపై, విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం ట్రోలింగ్ కి గురి కావడం విశేషం.”ట్విట్టర్ తెరిస్తే నా కొడుకులు ఏదేదో వాగుతున్నారు, వాళ్లకేం తెలుసంటూ” అంటూ స్టేజ్‌పై సీరియస్గ్గా కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సాధారణంమగా తమన్ ఎక్కువగా నెగెటివిటీని ఎదుర్కొంటారన్న సంగతి తెలిసిందే. ఆయన వర్క్‌ను తక్కువ చేస్తూ పలువురు నెటిజన్లు (Netizens) తీవ్ర విమర్శలు కురిపిస్తుంటారు. దానిని ఉద్దేశించే తమన్ సక్సెస్ మీట్లో ఇలా వ్యాఖ్యలు చేశారు. కాగా, తమన్ చేసిన కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమన్ తన జాతీయ అవార్డు కోసం ఇటీవల రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన దేవి శ్రీ ప్రసాద్‌పై సెటైర్లు విసిరి ఉండవచ్చు అనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. భగవంత్ కేసరి(Bhagwant Kesari)కి ముందు చాలా సినిమాలకు ఆయన సంగీతం అందించినా, అవి ప్లాప్ అయ్యాయని, ఆ విషయం మర్చిపోవద్దు అంటూ నెటిజన్లు గట్టిగానే కౌంటర్లు వేస్తుండటం గమనార్హం.