»Balayya Rare Record Bhagwant Kesari Towards 100 Crore
Balakrishna: బాలయ్య రేర్ రికార్డ్.. 100 కోట్ల వైపు దూసుకుపోతున్న ‘భగవంత్ కేసరి’!
అఖండ, వీరసింహారెడ్డి జోష్‌లో ఉన్న బాలయ్య హ్యాట్రిక్ కొట్టేందుకు దసరాకు భగవంత్ కేసరిగా ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అనుకున్నట్టే ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు బాలయ్య. దాంతో వంద కోట్ల వైపు దూసుకుపోతోంది భగవంత్ కేసరి.
అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరిగా.. బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ వసూళ్లను రాబడుతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ కేసరి.. తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 32.33 కోట్ల గ్రాస్ రాబట్టగా.. రెండు రోజుల్లో 51.12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మూడో రోజు కూడా దుమ్ముదులిపేశాడు బాలయ్య. మూడురోజుల్లో వరల్డ్ వైడ్‌గా 71.2 కొట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఇక సండే రోజు కూడా కేసరి బుకింగ్స్ అదిరిపోయిందని అంటున్నారు.
మండే దసరా కావడంతో.. మొత్తంగా 5 రోజుల్లోనే భగవంత్ కేసరి 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ కానుంది. దీంతో సీనియర్ హీరోల్లో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ రాబట్టిన హీరోగా.. రేర్ రికార్డ్ సొంతం చేసుకోనున్నాడు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరితో హ్యాట్రిక్ అందుకున్నాడు బాలయ్య. లాంగ్ రన్లో ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకోని.. బాలయ్య కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలచేలా ఉంది.
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా విన్నర్‌గా నిలిచినట్టే. ఈ మూవీలో కాజల్ హీరోయిన్గా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కూతురు పాత్రలో అదరగొట్టింది. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ డ్రామా బాగుండడంతో.. డే వన్ నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది భగవంత్ కేసరి. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించిన ఈ సినిమాకు.. థమన్ సంగీతం హైలెట్‌గా నిలిచింది.