Home Loan: పండుగ సీజన్లో మీ కలల ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే దానిని సాకారం చేసుకునేందుకు హోమ్ లోన్ తీసుకోవచ్చు. ముఖ్యంగా భారత ప్రభుత్వం రుణాలపై సబ్సిడీని అందించేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ తరుణంలో మీ రుణ భారాన్ని ఈ పథకాలు తగ్గించగలవు. దీంతో మీ స్వంత ఇంటి కల సాకారం అవుతుంది. పండుగ సీజన్లో హోమ్ లోన్లపై ఆదా చేయడంలో మీకు సహాయపడటానికి భారత ప్రభుత్వం అనేక సబ్సిడీ పథకాలను ప్రారంభించింది. అవేంటో తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గం, మధ్య ఆదాయ వర్గాలకు చెందిన వ్యక్తుల కోసం గృహ రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తుంది. ఆదాయ సమూహాన్ని బట్టి సబ్సిడీ మారవచ్చు. రుణ మొత్తంలో 6.5 శాతం వరకు ఉండవచ్చు.
క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్
ఇది PMAY పథకంలో ఒక భాగం . EWS, LI, MIG కోసం గృహ రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తుంది. సబ్సిడీ మొత్తం రుణ మొత్తంలో 6.5 శాతం వరకు ఉంటుం. గరిష్టంగా 20 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది.
స్టాంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీలలో మినహాయింపు
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పండుగ సీజన్లో స్టాంప్, రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపును అందిస్తాయి. మీరు కూడా దీని ప్రయోజనాన్ని పొందవచ్చు.
జీఎస్టీ కోత
నిర్మాణ ప్రాపర్టీలపై ప్రభుత్వం జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి, ఇతర ఆస్తులపై 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఈ మినహాయింపు ఆస్తి మొత్తం ఖర్చు, హోమ్ లోన్ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
చిన్న పట్టణ గృహాలకు వడ్డీ రాయితీ పథకం
చిన్న పట్టణ గృహాల కోసం సబ్సిడీ రుణాలను అందించడానికి భారత ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో రూ. 600 బిలియన్లు (రూ. 7.2 బిలియన్లు) ఖర్చు చేయాలని ఆలోచిస్తోంది. ఈ పథకం కింద, 9 లక్షల వరకు రుణం మొత్తంపై 3 నుండి 6.5 శాతం సబ్సిడీని అందిస్తోంది.