కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karti) గురించి అందరికీ తెలిసిందే. యుగానికి ఒక్కడు నుంచి మొన్నటి పొన్నియన్ సెల్వన్2 వరకు అన్ని సినిమాలు టాలీవుడ్(Tollywood)లో మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న సినిమాలు చేస్తున్న కార్తి.. చివరగా పొన్నియన్ సెల్వన్ సిరీస్‌తో హిట్ అందుకున్నాడు. త్వరలోనే జపాన్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక తాజాగా మరోసారి హిట్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసాడు. అయితే.. కార్తీ నుంచి సీక్వెల్ వస్తుంది అనగానే ఆడియన్స్ మైండ్ ఖైదీ 2 గురించి ఆలోచిస్తుంది.
ఎందుకంటే.. రీసెంట్గా లియో ప్రమోషన్స్‌లో భాగంగా ఖైదీ 2 కన్ఫామ్ చేశాడు లోకేష్ కనగారాజ్. కానీ లోకేష్ చేస్తున్న రజినీకాంత్ (Rajinikanth) తలైవర్ 171 సినిమా తర్వాతే ఖైదీ 2 స్టార్ట్ అవనుంది. అందుకే.. ఈ లోపు మరో హిట్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసాడు కార్తీ. పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో కార్తీ నటించిన సర్దార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఖైదీ రేంజులో హిట్ అవ్వలేదు కానీ.. సర్దార్ కూడా మంచి విజయాన్నే సాధించింది.
దాంతో వెంటనే సెకండ్ పార్ట్‌ను ప్రకటించారు మేకర్స్. కానీ ఇంకా మొదలు పెట్టలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే తాజాగా సర్దార్ సినిమా (Sardaar movie) విడుదలై సంవత్సరం అయిన సందర్భంగా.. ఈ హిట్ సీక్వెల్‌ను మరోసారి అనౌన్స్ చేశాడు కార్తీ. త్వరలో సర్దార్ 2 రాబోతుంది అంటూ ట్వీట్ చేశాడరు. దీంతో కార్తి అభిమానులు సర్దార్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ తర్వాత ఖైదీ2 సీక్వెల్ చేయనున్నాడు కార్తి. మొత్తంగా రెండు బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్‌లో అలరించనున్నాడు కార్తి.