స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు రాసే అభ్యర్థులకు బోర్డు శుభవార్త అందించింది. ఇక నుంచి ప్రాంతీయ భాషల్లోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. హిందీ, ఆంగ్లంతో పాటు మరో 13 భారతీయ భాషల్లో ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలుగు భాషలోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నియామక పరీక్షలు జరగనున్నాయి. పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ కోరారు. ఈ విషయమై 2020, నవంబర్ 18న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.