తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ వేడి పెరుగుతోంది. నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay)పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్య్యారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో మైనార్టీలు ఎప్పుడు అండగా ఉన్నారన్నారు. వారి సంక్షేమం కోసం తాను కృషి చేశానన్నారు. అరాచక, అవినీతిలేని ప్రశాంతమైన వాతావరణం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ను ఖాసీం రజ్వీతో పోల్చారు.
ఖమ్మం(Khammam)లో జరిగిన మైనార్టీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి కావాలని ప్రజలు అడిగేవారు. కానీ, ఇప్పుడు మాత్రం మా భూములు కబ్జా అయ్యాయని జనం లిస్ట్ తీసుకువచ్చి నాకు చెబుతున్నారు. పోలీసులు (Police) కూడా అధికారం ఉన్న వారి వైపే ఉన్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. మంత్రిగా అజయ్ కుమార్ మంచి చేయాల్సింది పోయి నాలుగేళ్ల కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తుమ్మల (Tummala) ఆగ్రహం వ్యక్తం చేశారు. తనది చిన్నతనం నుంచి పోరాడేతత్వమని, ప్రజలను భయపెట్టాలని భావించే వ్యక్తులకు వ్యతిరేకంగా తాను పోరాడానన్నారు.