Varla Ramaiah Made Sensational Comments On Chandrababu
Varla Ramaiah: స్కిల్ స్కామ్‌లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో మాజీ సీఎం చంద్రబాబు ఉన్నారు. టీడీపీ, ఆ పార్టీ నేతలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాబు అరెస్ట్ అయ్యారని తెలిసి ఆంధ్రప్రదేశ్‌లో 154 మంది చనిపోయారు. ఇదే విషయాన్ని టీడీపీ రాష్ట్రస్థాయి విసృతస్థాయి సమావేశంలో చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
చదవండి: Nara Lokesh : చంద్రబాబుని తలుచుకోని లోకేష్ కంటతడి..ఇదిగో వీడియో
మౌనం పాటించాలని వక్త వర్ల రామయ్య (Varla Ramaiah) చెప్పారు. అలా మాట్లాడే సమయంలో వర్ల రామయ్య (Varla Ramaiah) నోరు జారారు. అవును చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలిసి అభిమానులు చనిపోతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అని బదులు.. చంద్రబాబు చనిపోయాడనే బాధతో, గుండె బరువు ఎక్కి 154 మంది చనిపోయారని తెలిపారు. చంద్రబాబు చనిపోయారని వర్ల రామయ్య (Varla Ramaiah) నోటి నుంచి అనేశారు. ఆ సమయంలో వేదిక మీద ఉన్న అందరూ స్తబ్ధుగా ఉండిపోయారు. ఎవరూ అంత గమనించలేదు.
చంద్రబాబు నాయుడు చనిపోయాడని బాధతో, గుండె బరువుతో రాష్ట్ర వ్యాప్తంగా 154 మంది చనిపోయారు – వర్ల రామయ్య pic.twitter.com/MNtvaamGaJ
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2023
ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. వైసీపీ, ఇతర పార్టీ నేతలు ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. చంద్రబాబును అప్పుడే చంపేశారు.. వర్ల రామయ్య (Varla Ramaiah) మాటలతో హత్య చేసేశాడు అంటున్నారు. వర్ల రామయ్య (Varla Ramaiah) అనడం.. మౌనం పాటించాలని కోరడం కరెక్టుగా సరిపోయిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
చంద్రబాబుని కొనియాడుతూనే వర్ల రామయ్య (Varla Ramaiah) అలవాటులో పొరబడ్డారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని.. దేశ రాజకీయ యవనిక మీద తనదైన ముద్ర, అవినీతి మచ్చ లేని నేత.. 14 ఏళ్లు సీఎంగా చేశారంటూనే.. చనిపోయాడని నాలిక కరుచుకున్నారు. ఆ తర్వాత కూడా గుర్తించలేదు. దీంతో ట్రోల్‌కు గురవుతున్నాడు.

