TG: మెయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్రగ్స్, కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులను కస్టడీకి అనుమతిస్తూ.. రాజేంద్రనగర్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణపై త్వరలోనే పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.