తెలంగాణ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి(Raoula Chandrasekhar Reddy), కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి నేడు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో వీరిద్దరూ గులాబీ కండువా కప్పుకోనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రావుల మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ పడే అవకాశం ఉందని తెలుస్తోంది.యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy)మళ్లీ సొంత గూటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఆయన 2009లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఆ తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలతో బీజేపీలో చేరారు. అయితే అప్పటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)పై బహిరంగంగానే విమర్శలు చేశారు. అనంతరం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరారు. అయితే, కంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరికపై కినుక వహించిన ఆయన తిరిగి సొంతగూటికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం తెలంగాణ(Telangana)లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేస్తోంది. భువనగిరి (Bhuvanagiri) నుంచి పోటీ చేయాలని జిట్టా బాలకృష్ణారెడ్డి భావించారు. అయితే భువనగిరి టికెట్ తనకు దక్కదని భావించిన ఆయన కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.