VKB: కోడంగల్ పట్టణంలో ‘పేదల తిరుపతి’గా పేరొందిన శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి 46వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఇవాళ స్వామివారి రథోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అకట్టుకున్నాయి.