KMM: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు విశ్వనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్ పేరుతో బీసీ వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని TRP తీవ్రంగా ఖండిస్తున్నట్లు నాయకులు వెల్లడించారు. బీసీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించకుండా, ఖాళీ హామీలతో కాలం గడుపుతూ వారి హక్కులను దోచుకుంటుందని ఎద్దేవ చేశారు.