»Have You Tasted The Worlds Hottest Chili Pepper X Usa Carolina
Pepper x: ప్రపంచంలో అత్యంత కారమైన మిర్చిని చుశారా?
మీరు ప్రపంచంలోనే అత్యంత కారమైన మిర్చిని ఎప్పుడైనా చూశారా? లేదా అయితే ఇప్పుడు చూసేయండి. ఇటివల కరోలినాకు చెందిన పెప్పర్ X వరల్డ్ లోనే అత్యంత కారమైన మిర్చిగా గిన్నిస్ రికార్డుకెక్కింది. అయితే దీని విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
Have you tasted the world's hottest chili pepper x usa carolina
ప్రపంచంలోనే హాటెస్ట్ పెప్పర్(world hottest pepper) గా సౌత్ కరోలినా(south carolina)కు చెందిన పెప్పర్ X టైటిల్ గెల్చుకుంది. ఈ పెప్పర్ X.. 2.69 మిలియన్ స్కోవిల్లే హీట్ యూనిట్ల వద్ద ఈ ఘనతను సాధించింది. దీంతోపాటు పెప్పర్ స్ప్రే కూడా 1.6 మిలియన్ SHU వద్ద నమోదైంది. గతంలో 2013లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో (GWR) నిలిచిన ది కరోలినా రీపర్ “జలపెనో పెప్పర్ కంటే ఇది వందల రెట్లు కారంగా ఉంటుందని ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక కారంగా ఉండే ఈ మిరపకాయను ఎడ్ క్యూరీ రూపొందించారు. దానిని తిన్న తర్వాత అతను మూడున్నర గంటలపాటు కారం అనుభూతిని అనుభవించినట్లు చెప్పాడు.
USAలోని సౌత్ కరోలినాలో పుకర్బట్ పెప్పర్ కంపెనీ స్థాపకుడు అయిన ఎడ్ క్యూరీ ద్వారా ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయను పండించారు. అతను మొదటిసారిగా కరోలినా రీపర్‌ను పెంచి 2013లో టైటిల్‌ను తిరిగి గెలుచుకున్న వ్యక్తి కూడా ఇతనే కావడం విశేషం. క్యూరీ యూట్యూబ్ సిరీస్ “హాట్ వన్స్” ఎపిసోడ్లో పెప్పర్ Xని ప్రపంచానికి చూపించాడు. ఎడ్ తన పొలంలో 10 సంవత్సరాలకు పైగా పెప్పర్ Xని సాగు చేశాడు. దానిలోని క్యాప్సైసిన్ కంటెంట్‌ని పెంచడానికి తన హాటెస్ట్ పెప్పర్లతో క్రాస్ బ్రీడింగ్ చేశాడని వెల్లడించారు.
అంతేకాదు పెప్పర్ X సృష్టికర్త ఒక దశాబ్దం పాటు దానిని సాగు చేస్తూ తన మేధో సంపత్తిని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. ఏదైనా విత్తనాలు అమ్మకానికి ముందు దాని నుంచి అతని కార్మికులు ఎలా ప్రయోజనం పొందాలో కూడా ఆలోచిస్తామని క్యూరీ వివరించారు. ప్రస్తుతానికి పెప్పర్ ఎక్స్‌తో తయారు చేసిన హాట్ సాస్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు. మిరపకాయలలో చురుకైన భాగం అయిన క్యాప్సైసిన్ వాటిని తిన్న తర్వాత అనుభవించే విలక్షణమైన “మండే అనుభూతి”ని ప్రేరేపిస్తుంది.