»Paul Van Meekeren Posted Three Yaers Back Tweet Now Gone Viral
Paul Van Meekeren: డెలివరీ బాయ్ టూ వరల్డ్ కప్ ప్లేయర్
వన్డే ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికాను ఓడించి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించిన నెదర్లాండ్ పేసర్ పాల్ వాన్ మీకరన్ మూడేళ్ల కిందటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేెంటో ఇప్పుడు చుద్దాం.
Paul Van Meekeren: వన్డే వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ జట్టు సంచలనం సృష్టించింది. ఒక టెస్ట్ ప్లేయింగ్ దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధించి సంచలనం రేపింది. పాల్ ఈ విజయంలో పేసర్ పాల్ వాన్ మీకరన్ కీలకపాత్ర పోషించాడు. రెండు కీలక వికెట్లు ఈ మ్యాచ్‌లో పడగొట్టాడు. కొన్నాళ్ల కిందట మీకరన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కరోనా కారణంగా ఆ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది. ఆ సమయంలో మీకరన్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. ‘ఈ టైంలో క్రికెట్ ఆడుతూ ఉండాలి. కానీ ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తున్నాను. పూట గడవడానికి ఇది తప్పదు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతున్నాయో అని తలచుకుంటే ఒక్కోసారి నవ్వుస్తోంది. ఏదేమైనా అందరు నవ్వుతూ ఉండండని’ మీకర్ 2020 నవంబర్‌లో ట్వీట్ చేశాడు.
👉 November 2020 – Delivering food 👉 October 2023 – Delivering history
మీకరన్ మూడేళ్ల కిందట చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒకప్పుడు డెలివరీ చేసిన మీకరన్ ఇప్పుడు నెదర్లాండ్స్ టీమ్‌లో చరిత్ర సృష్టించడంలో కీలకపాత్ర పోషించాడని ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. క్రికెట్ ఆడేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయేసరికి ఉద్యోగం చేయాలని అనుకున్నాను. నిత్యావసరాల ఖర్చుల కోసం పని చేయాలి. మళ్లీ క్రికెట్ జట్టు నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. కాబట్టి దానికి అనుకూలంగా ఉండే జాబ్స్ కోసం ప్రయత్నించాను. అలా స్నేహితుల ద్వారా ఫుడ్ డెలివరీ ఉద్యోగం లభించిందని మీకరన్ తెలిపాడు. ఇది తెలిసిన నెటిజన్లు గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.