వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా(Team India) చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్థాన్ జట్టును విష జ్వరాలు వెంటాడుతున్నాయి. దీంతో పాక్ (Pak) మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బెంగళూరుకు పాక్ జట్టు చేరుకుంది. అయితే ఆదివారం బెంగళూరు(Bangalore)కు చేరుకున్నపాక్ జట్టు ఇప్పటివరకు ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం పాల్గోనలేదు. ఎందుకంటే పాక్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు.
వారిలో షాహీన్ అఫ్రిది(Shaheen Afridi), అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముందు జాగ్రత్తగా వీరికి వైద్య సిబ్బంది కోవిడ్ పరీక్షలు (Covid tests) నిర్వహించగా.. నెగిటివ్‌గా తేలింది.అయితే ఆసీస్‌తో మ్యాచ్ సమయానికి వీరు కోలుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.కెప్టెన్ బాబర్ అజామ్, స్టార్ పేసర్ షహీన్‌షా అఫ్రిది ఆరోగ్యంగానే ఉన్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ (Pakistan) జట్టు చిన్నస్వామి స్టేడియంలో తమ తొలి ప్రాక్టీస్ పాల్గొనవలసింది.కానీ ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నందన ప్రాక్టీస్ సెషన్స్‌ను సపోర్ట్ స్టాప్ నిర్వహించలేదు.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.