TG: HYDలో మైలార్దేవ్పల్లి పరిధిలోని వట్టేపల్లిలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై దాడులు చేసి, మత్తులో జోగుతున్న 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. హుక్కా సామాగ్రిని సీజ్ చేసి, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. యువత మత్తుకు బానిస కావొద్దని, అక్రమ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.