TG: ఈనెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ నేత జీవన్ రెడ్డి వెల్లడించారు. ‘అవమానాలు భరిస్తూ కాంగ్రెస్లో కొనసాగలేను. పార్టీ నుంచి వెళ్లాక నా విలువ ఏంటో వారికి తెలుస్తుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరడం లేదని, రాజీనామా అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గమంతా పర్యటిస్తానని స్పష్టం చేశారు.