Chandrababu: స్కిల్ స్కామ్లో అరెస్ట్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu). జైలులో ఉండటంతో దోమలు ఉన్నాయని, ఏసీ లేదని రకరకాల సమస్యలు చెప్పారు. ఏసీ లేకపోవడంతో డీ హైడ్రేట్ అయ్యారు. బరువు కూడా తగ్గారని భువనేశ్వరి అనగా.. అదేం లేదని వైద్యులు తెలిపారు. డీ హైడ్రేట్ అవడం ఖాయం అని.. చల్లని ప్రాంతంలో ఉంటే సరిపోతుందని వైద్యులు స్పష్టంచేశారు.
వైద్యుల సూచన మేరకు టీడీపీ నేతలు ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. జైలు గదిని చల్లగా ఉంచేలా ఏసీ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టులను న్యాయస్థానానికి సమర్పించారు. మెడికల్ రిపోర్టులు పరిశీలించిన ధర్మాసనం.. వెంటనే ఏసీ ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖకు ఆదేశాలు జారీచేశారు. టవర్ ఏసీ పెట్టాలని సూచించింది. మాములు ఏసీ పెట్టేందుకు సమయం పడుతుండగా.. టవర్ ఏసీ పెట్టాలని స్పష్టంచేసింది. స్కిల్ స్కామ్లో అరెస్టైన చంద్రబాబు జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ లభించలేదు.