Ola S1 Pro Gen2: ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ ఓలా (Ola) ఇటీవల భారత్ మార్కెట్లోకి ఓలా ఎస్ 1 ప్రొ జెన్ 2 (Ola S1 Pro Gen2) ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించింది. ఇంతకు ముందు ఓలా ఎస్ 1 ప్రో జనరేషన్ 1 (Ola S1 Pro Gen1) స్కూటర్‌కు మరిన్ని ఫీచర్లు జోడించి ఓలా జెన్2 స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఎన్నో నగరాల్లో స్కూటర్ డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. ఓలా ఎస్ 1 ప్రో జనరేషన్ 1 (Ola S1 Pro Gen1) కంటే అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చింది. మరి ఈ స్కూటర్ ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.
ఓలా ఎస్ 1 ప్రో జెన్ 2 (Ola S1 Pro Gen2) ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 195 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 120 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్లవచ్చని కంపెనీ తెలిపింది. 2.6 సెకన్లలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్‌కు 34-లీటర్ బూట్ స్పేస్, బలమైన గ్రాబ్ రైల్స్ ఇచ్చారు. తక్కువ బరువు ఉండేలా స్కూటర్‌ను డిజైన్ చేశారు. బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్, సస్పెన్షన్‌తో పాటు 11kW పీక పవర్‌తో శక్తివంతమైన మిడ్-డ్రైవ్ మోటార్‌తో వస్తుంది. జెట్ బ్లాక్, మ్యాట్ వైట్, స్టెల్లార్, మిడ్నైట్ బ్లూ, అమెథిస్ట్ రంగుల్లో ఈ స్కూటర్ లభిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.1,47,499(ఎక్స్‌షోరూం) గా కంపెనీ నిర్ణయించింది. ఓలా యాప్‌లోనూ ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు.