సినిమా సెలబ్రెటీల దగ్గర ఖరీదైన కారులు ఉండటం చాలా కామన్. కొంతమందికి కార్లు అంటే పిచ్చి. రకరకాల కార్లు కలెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడు అర్చిత్ రెడ్డి దగ్గర కూడా కాస్ట్లీ కార్లు ఉన్నాయి. తాజాగా ఆయనకు చెందిన ఓ కాస్ట్లీ కారు చోరీ జరిగింది. టాలీవుడ్ (Tollywood) టాప్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు దిల్ రాజు, బడా హీరోల సినిమాలతో పాటు కుర్ర హీరోలతోను సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న గేమ్ చెంజర్ సినిమా(Game changer movie)కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి భర్త అర్చిత్ రెడ్డి (Archit Reddy) కారు చోరీకి గురైంది. జూబ్లీహిల్స్ పోలీసులు సుమారు గంట పాటు శ్రమించి కారు ఆచూకీ కనుగొన్నారు. చోరీ చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని అతడి కుటుంబసభ్యులు వెల్లడించారు. దిల్‌రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్(Jubilee Hills)లోని దసపల్లా హోటల్‌కు రూ.1.7 కోట్ల ఖరీదైన తన పోర్షే కారులో వెళ్లారు. కారును హోటల్ వద్దే నిలిపి లోపలికెళ్లిన ఆయన 40 నిమిషాల తరువాత బయటకు వచ్చేసరికి కారు అదృశ్యమైంది. దీంతో, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన డీఐ వీరశేఖర్, డీఎస్సై రాజశేఖర్..సిబ్బందిని రంగంలోకి దింపి సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో పోర్షే కారు చెక్‌పోస్ట్ వద్ద రెడ్ సిగ్నల్ జంప్ చేసినట్టు గుర్తించారు. దీంతో, కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను వారు ఈ విషయమై అప్రమత్తం చేశారునిందితుడేమో తాను ఆకాశ్ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, కేటీఆర్ కారు తీసుకెళ్లాలని సూచించారని చెప్పడంతో చెప్పాడు. తాను, తన సహాయకుడు హృతిక్ రోషన్ కలిసి కారులో ఆకాశ్ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉందని చెప్పడంతో పోలీసులు షాకయ్యాురు.నిందితుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేయగా వారు అతడికి మతిస్థిమితం లేదని