»Rahul Priyanka Gandhi To Start Bus Yatra 18th Of This Month From Kondagattu
Telanganaలో రాహుల్, ప్రియాంక బస్సు యాత్ర.. ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచార పర్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 18వ తేదీన ప్రారంభిస్తారు. తన సోదరి ప్రియాంకతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి బస్సు యాత్ర చేపడుతారు.
Rahul, Priyanka Gandhi To Start Bus Yatra 18Th Of This Month From Kondagattu
Rahul, Priyanka Gandhi Bus Yatra: తెలంగాణ గట్టు మీద ప్రచార పర్వం ఊపందుకోనుంది. ఎల్లుండి సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి సమరశంఖం పూరించబోతున్నారు. ఈ నెల 18వ తేదీన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ప్రచార పర్వం ప్రారంభిస్తారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి బస్సు యాత్రను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల 18వ తేదీన ప్రారంభిస్తారు. అక్కడినుంచి నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర నేతలు అందరూ పాల్గొంటారు. బస్సు యాత్రతో కాంగ్రెస్ పార్టీకి నూతనోత్తేజం వస్తోందని.. ప్రజలు కూడా తమకు దగ్గర అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఈ నెల 18వ తేదీ నుంచి రాహుల్ బస్సు యాత్ర ప్రారంభం కానుండగా.. 16వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థులను విడుదల చేసే అవకాశం ఉంది. తొలి విడతలో 50 నుంచి 70 మందికి టికెట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. మిగతా వారికి రెండో విడతలో కేటాయిస్తారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సీట్ల ప్రకటన ప్రక్రియ జరిగి నెలరోజులు అవుతోంది. కాంగ్రెస్, బీజేపీ కాస్త ఆలస్యం అవుతోంది.