»Gangula Kamalakar Comments Conspiracy To Merge Telangana Into Andhra Pradesh Bjp Congress
Gangula Kamalakar: తెలంగాణను ఆంధ్రాలో కలిపేందుకు కుట్ర
తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపేందుకు కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యాలు చేయగా..వీటిపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎక్కడైనా అలా చేశారా అంటూ గంగులను ప్రశ్నిస్తున్నారు.
Gangula Kamalakar comments Conspiracy to merge Telangana into Andhra pradesh bjp congress
తెలంగాణ(telangana)లో వచ్చే నవంబర్ నెల చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. దీంతోపాటు తమ పార్టీ గ్రేట్ అంటే తమ పార్టీ గ్రేట్ అని విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) తెలంగాణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేజీ కాంగ్రెస్ పార్టీ ముసుగులో పడి మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఆ క్రమంలో ఆంధ్రవాళ్ల కాంగ్రెస్, బీజేపీ ముసుగులో రాష్ట్రానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే ఢిల్లీ పెద్దలతో సంప్రదించి మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలిపేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో తెలంగాణ ప్రజానికానికి చాలా ఇబ్బందికరమని మంత్రి గంగుల అన్నారు.
మరోవైపు సర్వేలన్ని తమకు అనుకూలంగా ఉన్నాయని కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(congress) పార్టీ పరిపాలనలో విఫలమైందని ఆరోపించారు. కర్ణాటకలో ప్రకటించిన ఉచిత హామీలు, పథకాలు అమలు చేయడానికి అక్కడి ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని ఆరోపించారు. అక్కడ అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తుందని ఎద్దేవా చేశారు. అంతేకాదు ఈసారి రాష్ట్రంలో బీజేపీ(BJP) ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని వెల్లడించారు. ఇక ఈటల కూడా ఈసారి గెలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యలు చేశారు.
అయితే తెలంగాణను ఆంధ్రా(andhra)లో కలిపేయాలనే వ్యాఖ్యల పట్ల పలువురు నేతలు గంగుల కమలాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అంటూ నిలదీస్తున్నారు. ఒకసారి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అలా ఎలా తెలంగాణను మళ్లీ ఆంధ్రా రాష్ట్రంలో కలుపుతారని ప్రశ్నిస్తున్నారు. అసలు అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. అంతేకాదు అనేక ప్రశ్నపత్రాలు లీక్ చేయడంతోపాటు ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు.