»Australias Top Order Utter Flop South Africas Big Win
ODI World Cup: ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్.. సౌతాఫ్రికా ఘన విజయం
వన్డే వరల్డ్ కప్లో వరుసగా రెండో విజయాన్ని సౌతాఫ్రికా నమోదు చేసింది. నేడు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.
నేటి వరల్డ్ కప్ (World Cup) మ్యాచ్లో ఆస్ట్రేలియా (Australia)పై సౌతాఫ్రికా (South Africa) ఘన విజయం సాధించింది. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 134 పరుగుల భారీ తేడాతో కంగారూలను ఓడించింది. మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. సఫారీ ఇన్నింగ్స్లో ఓపెనర్ క్వింటన్ డికాక్ 109 పరుగులతో విజృంభించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 40.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఆసీస్ (Australia) ఇన్నింగ్స్లో 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ స్కోరును ముందుకు కదిలించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అతని ప్రయత్నం ఫలించలేదు. లబుషేన్ అత్యధికంగా 46 పరుగు మాత్రమే చేయగలిగాడు. లోయరార్డర్ లో మిచెల్ స్టార్క్ 27, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 22 పరుగులతో సరిపెట్టుకున్నారు. ఓపెనర్లు మిచెల్ మార్ష్ 7, డేవిడ్ వార్నర్ 13 పరుగులు మాత్రమే చేయగలిగారు. టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో స్కోర్ పెరగలేదు.
ఈ వరల్డ్ కప్ (World Cup- 2023)లో దక్షిణాఫ్రికా (South Africa)కు ఇది వరుసగా రెండో విజయం కావడంతో సఫారీల నెట్ రన్ రేట్2.360కు పెరిగింది. దీంతో వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా మొదటి స్థానానికి చేరింది.