తెలంగాణ సచివాలయంలో శాఖల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖ మరో శాఖ విలీనమైంది. గృహ నిర్మాణ శాఖను రవాణా, రోడ్లు, భవనాల శాఖలోకి విలీనం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో కొత్త పథకాలేవీ చేపట్టకపోవడంతో, హౌసింగ్ డిపార్ట్మెంట్ను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హౌసింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఆస్తులు, పథకాలు, సిబ్బంది బాధ్యతలను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆర్ అండ్ బీ శాఖలోనే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు.