»Congress Party And Mallikarjun Kharge On 18 Gst On Ganga Water Pm Modi In Pithoragarh
GST on Gangajal: గంగా జలంపై 18శాతం జీఎస్టీ.. కేంద్రంపై దుమ్మెత్తి పోస్తున్న కాంగ్రెస్
ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్నారు సరే.. హింసాత్మకంగా దెబ్బతిన్న మణిపూర్‌లో ఎప్పుడు పర్యటిస్తారని ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో యానిమేటెడ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇందులో హింసాత్మకమైన మణిపూర్, కాలిపోయిన మృతదేహాలు ఉన్నాయి.
GST on Gangajal: ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) గురువారం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు చేరుకుని అర్చన కుండ్‌లో ప్రార్థనలు చేశారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) గంగాజలంపై పై 18శాతం జీఎస్టీ విధించినందుకు ప్రధాని మోడీపై మండిపడ్డారు. ఇది మీ ప్రభుత్వ దోపిడి, వంచన ఎత్తు అని ఖర్గే ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇది మతపరమైన భావాలకు ద్రోహంగా ఖర్గే అభివర్ణించారు. ఒక సాధారణ భారతీయుడు పుట్టినప్పటి నుండి జీవితాంతం వరకు మోక్ష ప్రదాత అయిన గంగా మాతను పూజిస్తుంటారు. మీరు(ప్రధాని మోడీ) కూడా ఈరోజు ఉత్తరాఖండ్‌లోనే ఉన్నారు, కానీ మీ ప్రభుత్వం పవిత్ర గంగా జలంపైనే 18శాతం జీఎస్టీ విధించింది. దీంతో ఇళ్లకు గంగాజలం(Ganga Water) సరఫరా చేసుకునే భక్తులపై ఎంత భారం పడుతుందో ఒక్క సారైనా ఆలోచించారా అని ప్రశ్నించారు.
ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్నారు సరే.. హింసాత్మకంగా దెబ్బతిన్న మణిపూర్‌లో ఎప్పుడు పర్యటిస్తారని ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో యానిమేటెడ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇందులో హింసాత్మకమైన మణిపూర్, కాలిపోయిన మృతదేహాలు ఉన్నాయి. దేశం అడుగుతోంది – ప్రధాని మోడీ మణిపూర్(manipur) ఎప్పుడు వెళ్తారంటూ క్యాప్షన్ ఇచ్చారు. గతంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కూడా గంగా జలాలపై జీఎస్టీ విధించే అంశాన్ని టార్గెట్ చేశారు. బీజేపీ మతం గురించి మాట్లాడుతుంది కానీ గంగా జలంపై ఎందుకు జీఎస్టీ విధించారు? జీఎస్టీ విధింపుతో ఇంటింటికి గంగాజలం అందాలంటే గతంలో కంటే ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు.