»A Couple Romance While Riding A Bike Uttar Pradesh Hapur Police Fined Rs 8000
Viral video: బైక్ రైడ్ చేస్తూ జంట రొమాన్స్..షాకిచ్చిన పోలీసులు
బైక్ పై రైడ్ చేస్తూ ఓ జంట రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఇది గమనించిన పోలీసులు వారికి షాకిచ్చారు. అంతేకాదు ఆ జంటకు భారీ జరిమానా కూడా విధించి హెచ్చరించారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చుద్దాం.
A couple romance while riding a bike uttar pradesh Hapur Police fined rs 8000
ఇటివల కాలంలో అనేక జంటలు, లవర్స్ ద్విచక్రవాహనాలపై రైడ్ చేస్తూ రోడ్లపైనే రొమాన్స్ చేస్తూ వెళ్తున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఆ క్రమంలో అటుగా ప్రయాణించిన పలువురు ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అవి కాస్తా వైరల్ గా మారాయి. అయితే తాజాగా కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ జంట బైక్(bike)పై వెళుతుండగా ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కింది.
వీడియోలో బైక్ నడుపుతున్నప్పుడు మహిళ బైక్ నడుపుతున్న వ్యక్తిని గట్టిగా కౌగిలించుకోవడం కనిపిస్తుంది. అంతేకాదు వారిద్దరూ కూడా హెల్మెట్ ధరించలేదు. ఇది వారి ప్రాణాలకు చాలా ప్రమాదం. మరోవైపు నడిరోడ్డుపై అలా అసభ్యకరంగా ప్రవర్తించడం కూడా సరికాదని వీడియో చూసిన పలువురు అంటున్నారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో స్పందించిన హాపూర్ పోలీసులు మోటారు వాహనాల చట్టం కింద ఆ దంపతులకు రూ.8వేల జరిమానా(fined) విధించారు. సింభవోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9వ నెంబరు జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది.
थाना सिम्भावली क्षेत्रांतर्गत नेशनल हाईवे पर एक कपल द्वारा बाइक से स्टंटबाजी करने के फोटो सोशल मीडिया पर वायरल हुए जिनका #Hapurpolice द्वारा तत्काल संज्ञान लेकर उक्त बाइक का एमवी एक्ट के तहत 8000/-रुपये का चालान किया गया है एवं अग्रिम विधिक कार्यवाही की जा रही है।
.@Uppolicepic.twitter.com/syrhq6mPQi
అంతేకాదు హాపూర్ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియా(social media)లో షేర్ చేశారు. జాతీయ రహదారిపై బైక్‌పై విన్యాసాలు చేస్తున్న ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తక్షణమే గుర్తించి #Hapurpolice ₹8000/- చలాన్ జారీ చేశామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇలా చేస్తే చర్యలు తప్పవన్నట్లు హెచ్చరించింది. హాపూర్ పోలీసులు షేర్ చేసిన ట్వీట్‌కి ఇప్పటి వరకు 11,700 వీక్షణలు వచ్చాయి. అంతేకాదు ఇది చూసిన అనేక మంది చాలా మంచి పని చేశారని కామెంట్లు చేశారు. అలాంటి వారిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని మరికొంత మంది అన్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు చేసిన మెచ్చుకోదగిన పనికి చాలా అభినందనలు, ధన్యవాదాలు అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు. అయితే ఈ సంఘటనపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.