పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట దాడిలో కీలక సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. 2016లో పఠాన్‌కోటపై జరిపిన దాడిలో భారత సైనికులు ఏడుగురు మరణించగా.. ఆరు మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
Pathankot attack mastermind.. Most wanted terrorist Shahid Latif killed
Pathankot: భారత మోస్ట్ వాంటెడ్(India’s Most Wanted) ఉగ్రవాది(Terrorist) షాహిద్ లతీఫ్(Shahid Latif) పాకిస్థాన్‌లోని సియోల్‌కోట్(Seolkot)లో ఈ ఉదయం హతమయ్యాడు. గుర్తుతెలియని బలగాలు అతడిని కాల్చిచంపాయి. పఠాన్‌కోట(Pathankot) దాడిలో షాహిద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న అతనిపై భారత్‌లో చాలా కేసులు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యుడైన 41ఏళ్ల షాహిద్ 12 నవంబరు 1994లో యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ అయి 16 ఏళ్లపాటు జైలు జీవితం గడిపాడు. 2010లో వాఘా బోర్డర్ ద్వారా పాక్ చేరాడు.
2 జనవరి 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తెగబడింది. దట్టమైన పొగమంచు ఉన్న సమయంలో అడవిలో నక్కి, చీకట్లో సైనిక దుస్తుల్లో నలుగురు ముష్కరులు వైమానిక స్థావరంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. భారత భద్రతా సిబ్బంది వారిని ఎదుర్కొన్నారు. ఎదురు కాల్పులు మొదలుపెట్టారు. ఐదు గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో ఏడుగురు భారత సైనికులు వీరమరణం పొందారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్ఎస్జీ, స్వాట్ బృందాలు సమన్వయంతో వ్యవహరించడంతో ముప్పు తప్పింది. ఉగ్రవాదుల వద్ద పెద్దఎత్తున ఆర్డీఎక్స్, గ్రానైడ్ లాంచర్ మిషన్, 52 ఎంఎం మోర్టార్లు, ఏకే 47 తుపాకులు, జీపీఎస్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో షాహిద్ లతీఫ్ ఉన్నట్లు భారత ప్రభుత్వం గుర్తించి.. అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ప్రకటన విడుదల చేసింది.
Big news : Most wanted terrorist Rashid Latif shot dead by "unknown assailants" in Pakistan. He was the mastermind of the Pathankot terrorist attack.