»A Beggar Who Bought An Iphone With Retail Netizens Funny Comments
Video Viral: చిల్లరతో ఐఫోన్ కొన్న బిచ్చగాడు..నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్
ఓ బిచ్చగాడు తన వద్ద ఉన్న చిల్లరతో ఐఫోన్‌ను కొన్నాడు. మొదట అతన్ని ఎవ్వరూ షాపు లోపలికి రానివ్వలేదు. ఆఖరికి ఓ షాపు యజమాని మాత్రం ఆ బిచ్చగాడి వద్ద చిల్లర తీసుకుని ఐఫోన్ ఇచ్చాడు. ఆ తర్వాత అందరికీ ట్విస్ట్ తెలియడంతో అవాక్కయ్యారు.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు (Smart Phones) వాడేందుకు ప్రతి ఒక్కరూ ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇక ఐఫోన్ (iPhone) అంటే పడి చచ్చిపోతున్నారనుకోండి. మార్కెట్లోకి ఐఫోన్ నుంచి కొత్త మోడల్ వస్తే చాలు ఎగబడిమరీ కొనేస్తున్నారు. ఆ ఐఫోన్లను కొనేందుకు సామాన్యులు మాత్రం కాస్త వెనకడుగు వేస్తున్నారు. అయితే ఓ బిచ్చగాడు ఐఫోన్ కొన్నారంటే మీరు నమ్ముతారా? కానీ తన వద్ద ఉన్న చిల్లరతో ఓ బిచ్చగాడు ఐఫోన్‌ను కొనేశాడు. ఆ ఫోన్ కొన్నతర్వాత అసలైన ట్విస్ట్ చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు.
‘ఎక్స్పెరిమెంట్ కింగ్’ (Experiment King) అనే యూట్యూబ్ ఛానల్ వాళ్లు కాస్త డిఫరెంట్‌గా ప్రాంక్ చేద్దామని ఆలోచించారు. తమ సిబ్బందిలో ఒకడు బిచ్చగాడి వేషం వేసుకుని ఐఫోన్ కొనాలనుకున్నాడు. జోధ్‌పూర్ లోని మొబైల్ షోరూమ్‌లన్నీ తిరిగితే ఎవ్వరూ లోపలికి రానివ్వలేదు. మరికొందరు అతన్ని లోపలికి రానిచ్చినా అతని వద్ద ఉన్న చిల్లర తీసుకోవడానికి నిరాకరించారు.
చివరగా ఓ షాపు యజమాని మాత్రం ఆ బిచ్చగాడి నుంచి చిల్లర తీసుకుని ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్ (iPhone Pro Max Model)ను అందజేశారు. ఇక ఐఫోన్ తీసుకున్న తర్వాత ఆఖరిలో తాను నిజమైన బిచ్చగాడు కాదని, అదొక ప్రాంక్ వీడియో (Prank Video) అని చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.
ఆ వీడియోను చూసి కొందరు..బిచ్చగాడు ఐఫోన్ కొనడమేంటని అనుకున్నారు. నెటిజన్లు మాత్రం ఆ వీడియోకు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఐఫోన్ కొన్న ఆ వ్యక్తి ముంబైలో సులభ్ కాంప్లెక్స్ నిర్వహించి ఉంటాడని ఒకరు కామెంట్ చేస్తే మరొకరు మాత్రం అవన్నీ పాత స్టంట్స్ అంటూ కామెంట్ చేశాడు. స్క్రిప్ట్ రాసుకుని ఏదైనా కొత్తగా ట్రై చేయమని ఇంకొకరు సలహా ఇచ్చాడు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.