»Pawan Kalyan Has Viral Fever All Janasena Meetings Are Cancelled
Janasena: పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్.. జనసేన సమావేశాలన్నీ రద్దు
జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఫీవర్ రావడంతో ఆ పార్టీ నిర్వహించి అన్ని సమావేశాలు రద్దయ్యాయి. సమావేశం తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటనలో తెలిపింది.
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు జ్వరం వచ్చింది. ఆయనకు వైరల్ ఫీవర్ (viral fever) రావడంతో రేపు జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశం రద్దు అయ్యింది. ఈసారి ఏపీ ఎన్నికల్లో (Andhrapradesh Elections) జనసేన వైసీపీ (YCP)తో ఢీకొనబోతోంది. టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈ మేరకు పవన్ ఇప్పటికే ఆ విషయాన్ని వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో పవన్ కళ్యాణ్ నారా లోకేశ్ (Nara Lokesh)తో కలిసి చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఏపీలోని అధికార పార్టీ అయిన వైసీపీని ఢీకొట్టేందుకు కార్యాచరణను రూపొందించాలని బాబు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జనసేన, టీడీపీ ఎన్నికల వర్కింగ్ టీమ్ రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ (TDP)తో కలిసి క్షేత్ర స్థాయిలో జనసేన బరిలోకి దిగనుంది.
అయితే టీడీపీ, జనసేన పార్టీ నేతలు రేపటి నుంచి పలు సమావేశాలు నిర్వహించనున్నాయి. ఆ సమావేశాల్లో పవన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. ఈ టైంలోనే పవన్‌కు వైరల్ ఫీవర్ రావడంతో జనసేనాని సమావేశాలన్నీ రద్దు అయ్యాయి. వాటిని వాయిదా వేశారు. సమావేశం తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని జనసేన పార్టీ (Janasena Party) ప్రకటనలో తెలిపింది.