»Rat Milk 18 Lakhs Per Liter Of Rat Milk The Specials Are Sure To Surprise You
Rat Milk: ఎలుక పాలు లీటర్ రూ.18 లక్షలు..ప్రత్యేకతలు చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం!
ఇప్పటి వరకూ ఆవు, గేదె పాలు లేదంటే గాడిద, ఒంటె పాల గురించి వినుంటారు. తాజాగా ఇప్పుడు ఎలుక పాల గురించి, ఆ పాల ధర గురించి ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక లీటర్ ఎలుక పాలు ఏకంగా రూ.18 లక్షలు పలుకుతోందంటే అందరూ షాక్ అవుతున్నారు.
ఇప్పటి వరకూ గాడిద పాలు, ఒంటె పాలు గురించి విన్నాం. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలోకి ఎలుక పాలు వచ్చింది. ఉదయం లేవగానే టీ, కాఫీ తాగనిదే కొందరికి రోజు గడవదు. వాటి కోసం ఆవు పాలు, గేదె పాలు, కొందరైతే మేక పాలు కూడా వినియోగిస్తుంటారు. అయితే వినియోగంలో ఎక్కువ మంది గేదె లేదా ఆవు పాలును ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఏ పాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయో వాటివైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే పోషకాలు ఎక్కువగా ఉన్న పాలను వినియోగిస్తే మరికొంత కాలం ఆరోగ్యంగా ఉండొచ్చనే నమ్మకం బలపడింది.
వేల రూపాయల ఖరీదైన గాడిద, ఒంటె పాలు అమ్మకాలలో పోటీ పడుతున్నాయి. తాజాగా ఎలుక పాలు అంతకు మించి అన్నట్లుగా ధర పలుకుతోంది. ఎలుక పాలు అంటేనే చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. అసలు అంత చిన్న ఎలుక నుంచి పాలను ఎలా సేకరిస్తారనే సందేహం కూడా కలుగుతుంటుంది. కానీ ఎలుక పాలను కూడా సేకరిస్తారని ఇప్పటి వరకూ చాలా మందికి తెలిసి ఉండదు.
మార్కెట్లో ఇప్పుడు లీటరు ఎలుక పాలు 23 వేల యూరోలు పలుకుతోంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా దాని విలువ రూ.18 లక్షలు పలుకుతోంది. సాధారణంగా అంత డబ్బులు పెడితే ఓ చిన్నపాటి ఇల్లు సొంతం చేసుకోవచ్చు. ఓ మంచి షాపు పెట్టుకుని వ్యాపారం చేయొచ్చు. కానీ ఇక్కడ ఓ చిన్నప్రాణి పాలు రూ.18 లక్షలు అంటే ఆశ్చర్య పోవాల్సిందే మరి.
చిన్న ఎలుక నుంచి లీటర్ పాలను సేకరించాలంటే అంది అంత సులభమేమీ కాదు. ఎలుక చిన్న ప్రాణి పిల్లలను పెట్టాక దాని శరీరంలో పాలు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి లీటర్ ఎలుక పాల సేకరణ కోసం దాదాపు 40 వేల ఎలుకలు కావాల్సి ఉంటుంది. అప్పుడే వాటి నుంచి లీటర్ పాలు ఉత్పత్తి అవుతుంది. అందుకే ఆ పాలు అంత ధర పలుకుతోంది. ఎలుక పాలను ఎక్కువగా పరిశోధనలల్లో ఉపయోగిస్తుంటారు. మలేరియా బ్యాక్టీరియాను చంపే మందులు తయారీకి వీటినే ఎక్కువగా వాడతారు. అంతేకాదు మానవ శరీరంలో వ్యాక్సిన్ వేసే పరిశోధనలు చేయాలంటే ముందుగా ఎలుకపై ప్రయోగించి ఫలితాలు వచ్చాక మనిషిలో ప్రవేశపెడతారు.