స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. అదేవిధంగా బాబును కస్టడీకి కోరుతూ సీఐడీ ధాఖలు చేసిన పిటిషన్‌ను కూడా డిస్మిస్ చేసింది.
ACB Court: స్కిల్ డెవలప్మెంట్(Skill development) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు కస్టడీని పొడగించారు. ప్రస్తుతం బాబు తరుఫు లాయరు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్లను డిస్మిస్ చేసింది.
చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 5వ తేదీన ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. మరికొన్ని వాదనలు వినిపించడం కోసం పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరడంతో కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో 6వ తేదీన మరికొన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని.. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరారు. అనంతరం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే… ఇప్పటికే ఒకసారి చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇచ్చారని, రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. ఇద్దరి వాదనాలు విన్న ఏసీబీ కోర్టు తాజాగా రెండు పిటిషన్లను డిస్మిస్ చేసింది.