»What Should The Leaders Not Do After The Code Comes Into Force
Election Code అమల్లోకి రావడంతో నేతలు ఏం చేయద్దంటే..?
తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి రావడంతో నేతలు పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ వాహనాలు, హెలికాప్టర్ వాడొద్దు.. రూల్స్ బ్రేక్ చేస్తే కమిషన్ చర్యలు తీసుకుంటుంది.
Karimnagar Collector And Police Commissioner Transfer
Election Code: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ (Election) అమల్లోకి వచ్చింది. సో.. ఇక అధికార పార్టీ నేతలు అధికారం దుర్వినియోగం చేయొద్దు. పార్టీ పనులకు అధికార యంత్రాగాన్ని ఉపయోగించొద్దు. అధికార పర్యటనలు, ప్రచార పర్యటనలు రెండు కలిపి ఉండ కూడదు. సీఎం, మంత్రులు ప్రభుత్వ వాహనాలను ఇంటి నుంచి కార్యాలయం, ఆఫీసు నుంచి ఇంటికి మాత్రమే వాడాలి. హెలికాప్టర్‌తోపాటు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.
సెక్యూరిటీ వాహనాల్లో మూడు కన్నా ఎక్కువ వాడితే అదీ ఎన్నికల వ్యయం కింద విధిగా చూపించాల్సి ఉంటుంది. షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తోంది. ప్రభుత్వ వసతి గృహాలు, సభా స్థలం, హెలిప్యాడ్ అధికార పార్టీకే కాకుండా ఇతర పార్టీలకు కూడా అవకాశం కల్పించాలి. పత్రికలు, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రకటనలు ఇవ్వొద్దు. టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చిన తర్వాత గ్రాంట్లు ఇవ్వొద్దు.. ఎలాంటి చెల్లింపులు చేయకూడదు. కొత్త పథకాలను ప్రకటించొద్దు. అలాగే శంకుస్థాపనలు చేయొద్దు.. రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు. పై ఒక్క దాంట్లో ఏదీ చేసిన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తోంది. తమ విచక్షణ మేరకు కమిషన్ సంబంధిత వ్యక్తి/ పార్టీపై చర్యలకు ఉప క్రమిస్తారు.