ఇజ్రాయెల్(Israel), పాలస్తీనాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇరు దేశలో దాదపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి వర్గలు తెలిపాయి. ఇజ్రాయెల్‌లో ఉన్న భారత పౌరుల గురించి ఆందోళన నెలకొంది. దాదాపు 18 వేల మందికి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌లోని వివిధ పట్టణాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో హైవేలపైనే చిక్కుకుపోయినట్లు సమాచారం. వీళ్లలో కొందరు బతుకు తెరువుకోసం వెళ్లిన వాళ్లుకాగా, మరికొందరు ఐటీ ఉద్యోగులు(IT employees), విద్యార్థులు ఉన్నారు.
యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రజలతో పాటు అక్కడున్న విదేశీ పర్యాటకులు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జెరుసలేం(Jerusalem)లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులను అప్రమత్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని సూచించింది. రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని కోరింది. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నవారిలో భారత్ రాజ్యసభ ఎంపీ వాన్‌వేయ్‌రాయ్ ఖార్లుఖీ ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నారు.
మేఘాలయ (Meghalaya) నుంచి నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లారు. హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై హమాస్ (Hamas) మిలిటెంట్లు దాడి చేయడంతో బెత్లహమ్లో చిక్కుకుపోయారు.ఇజ్రాయెల్‌లోని వృద్ధుల సంరక్షణ కోసం పలు ఏజెన్సీలు భారత్ నుంచి వందలాది మందిని నియమించుకుంటాయి. భారత్ (India) నుంచి అక్కడికి వెళ్లిన వారిలో వీళ్లే ఎక్కువగా ఉంటారు. మరోవైపు,గతంతో పోల్చుకుంటే ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితులు కొంతమేర కుదుటపడినట్లు అక్కడి భారతీయులు కొందరు జాతీయ మీడియాకు వెల్లడించారు