హైదరాబాద్ లో అక్రమ కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు మంత్రి తలసాని. ఈ నెల 25న కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. నగరంలోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ యుద్ధ ప్రాతిపదికన స్పందించాయన్నారు. ప్రమాదం జరిగిన భవనంలో కెమికల్స్ ఉండటం వల్ల మంటలు తొందరగా అదుపులోకి రాలేదని ఆయన తెలిపారు.
పక్కన ఉన్న బస్తీకి మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు. నిన్న అగ్ని ప్రమాదానికి గురైన కట్టడాల లాంటివి 25 వేల వరకు హైదరాబాద్ లో ఉన్నట్టు అంచనా. అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు. అక్రమ కట్టడాల విషయం లో ఏం చేయాలి అన్నదానిపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు.