‘మంగళ వారం’ కొత్త సాంగ్.. రెచ్చిపోయిన పాయల్, పెదాలను నాకేసిందిగా!
అసలు పాయల్ రాజ్‌పుత్.. పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో దడపుడుతుంది.. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.. ఆమె ఫిగర్‌కు దాసోహం కానీ వారు ఉండరేమో.. ఫస్ట్ సినిమా ఆర్ఎక్స్ 100తో అలా కట్టిపడేసింది అమ్మడు. ఇక ఇప్పుడు మంగళవారంలో అంతకుమించి అనేలా హాట్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
'Mangala Varam' new song release.. Payal hot treat
‘Mangala Varam’: ‘ఆర్ ఎక్స్ 100’ కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు అజయ్ భూపతి కలిసి చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మంగళ వారం’. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని తహతహలాడుతున్నారు ఈ ఇద్దరు. అందుకే.. ఆర్ఎక్స్ 100లో కంటే బోల్డ్‌గా పాయల్‌ను చూపిస్తున్నాడు అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 తర్వాత వరుస ఆఫర్స్ అందుకున్నప్పటికీ.. పెద్దగా క్లిక్ కాలేకపోయింది పాయల్ రాజ్‌పుత్. దాంతో మరోసారి తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడినే నమ్ముకుంది. అందుకే.. మంగళవారం సినిమాతో రెచ్చిపోతోంది. మొత్తంగా ఈ ఇద్దరి ఆశలన్నీ మంగళవారం మీదే ఉన్నాయి.
సినిమా ఇంతవరకు ఎవరు టచ్ చేయని జోనర్లో ఉంటుందని ముందే చెప్పాడు అజయ్ భూపతి. సినిమాలో దాదాపు 30 పాత్రలు ఉంటాయని, అవి సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని అన్నాడు. ఇటీవలే రిలీజైన మంగళవారం టీజర్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘గణగణా మోగాలిరా’ సాంగ్ కూడా అదిరిపోయింది. ఇక ఇప్పుడు అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఏమైందో ఏమిటో అంటూ సాగే ఈ పాటలో.. నటుడు అజ్మల్‌తో రెచ్చిపోయింది పాయల్. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఇచ్చిన ఈ మెలోడి సాంగ్‌లో నాభి అందంతో కట్టిపడేసింది పాయల్. అలాగే హీరోతో లిప్ లాక్ సీన్ కూడా చేసింది. అతని పెదాలను అమాంతం నాకేసింది అమ్మడు. దీంతో లిరికల్ సాంగ్‌కే ఇలా ఉంటే.. ఇక ఫుల్ సాంగ్ ఇంకే రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాను నవంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్‌గానే ప్రకటించారు. మరి మంగళవారం ఎలా ఉంటుందో చూడాలి.