Aditi: చూడగానే ఆకట్టుకునే అందం అదితి సొంతం. దక్షిణాదితోపాటు, ఉత్తరాదిలో కూడా సినిమాలు చేస్తుంది. తెలుగులో సమ్మోహనం మూవీతో ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. ఇంద్ర గంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా ఎదగకపోయినా, వరసగా అవకాశాలు అందుకుంటుంది.
బాలీవుడ్లో ఢిల్లీ 6 అనే మూవీలో నటించింది. సినిమా కూడా బాగానే క్లిక్ అయ్యింది. వరసగా బాలీవుడ్లో ఆఫర్లు వచ్చాయి.
కెరీర్‌ని మళయాళంలో మొదలుపెట్టింది. అక్కడి నుంచి తమిళంలోకి, ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టి, అదరగొట్టింది.
అదితి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోల్లో అదితి చాలా అందంగా కనపడుతోంది.
బ్లాక్ అండ్ వైట్ జంప్ సూట్లో మెరిసింది. సింపుల్ జ్యూవెలరీ ధరించింది. స్లీవ్ లెస్‌లో అందాలు ప్రదర్శించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.
హీరో సిద్ధార్థ్‌తో అదితి ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి షికార్లు చేస్తూ, ట్రిప్‌లకు వెళ్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో వీరు ప్రేమలో ఉన్నారని అర్థమైంది. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.=