ELR: యువకుడు అనుదీప్ మృతిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా ఎస్పీకి సూచించారు. చాట్రాయిలో చెరువులో పడి మరణించిన అనుదీప్ కుటుంబ సభ్యులను ఇవాళ ఆయన పరామర్శించారు. అనంతరం ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, అనుమానాలకు తావులేకుండా ఇతర ప్రాంత అధికారులతో ప్రత్యేక విచారణ చేయించాలని కోరారు.