TG: హైడ్రాపై ఆధారాలు లేకుండా పొలిటీషియన్లు ఆరోపణలు చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా రాజీపడిందని నిరూపిస్తే పదవిని వదులుకుంటా అని సవాల్ విసిరారు. రాజకీయాలకు అతీతంగా ఎవర్నీ వదలమని హెచ్చరించారు. కొందరు ఇప్పుడు పార్టీ మారి లాబీయింగ్ చేస్తున్నారని.. రియల్ ఎస్టేట్ తగ్గడానికి తాను కారణం కాదన్నారు. తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి లేదని స్పష్టం చేశారు.