TG: రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెట్టడంతో.. రైతు బీమా పథకాన్ని ఎత్తేస్తుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు రైతు బీమా స్థానంలోనే ఇందిరమ్మ బీమా తెస్తుందా..? అది రేషన్ కార్డులో పేర్లున్న అందరికీ వర్తిస్తుందా..? లేదా కుటుంబ పెద్దకు మాత్రమే వర్తిస్తుందా? ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది.