ADB: నార్నూర్ మండలంలోని మాలేపూర్ గ్రామంలో సాగు చేస్తున్న గంజాయి తోటపై శనివారం పోలీసులు దాడి చేశారు. సీఐ ప్రసాద్, SI శ్రీసాయి వివరాల ప్రకారం.. మాలేపూర్కు చెందిన బాలాజీ అనే వ్యక్తి తన వ్యవసాయంలో గంజాయి సాగు చేస్తున్నాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 24 మొక్కలు స్వాధీనం చేశామన్నారు. దీన్ని విలువ రూ.2,40,000 ఉంటుందని అంచనా వేశారు.